రాష్ట్రంలో ధాన్యం సేకరణ.. 24 గంటల్లో సొమ్ము జమ..! 1 d ago
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లో సొమ్ము జమ చేస్తున్నామని తెలిపారు. ఆదివారం నాటికి 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించబడిందని మంత్రి 'ఎక్స్'లో పోస్ట్ చేసారు. కరీఫ్ సీజన్‌లో 4,15,066 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించామని, వారి ఖాతాల్లో ఇప్పటివరకు రూ.6,083.69 కోట్లు జమ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల కుటుంబాల్లో సంక్రాంతి సందడి తెచ్చిందన్నారు.